TG : మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమం చేస్తాం : గుత్తా సుఖేందర్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ స్వాగతిస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. భారత ప్రధానిగా వాజ్ పాయ్ ఉన్న హయాంలోనే నదుల ప్రక్షాళనకు అడుగు పడిందని గుర్తు చేశారు. సీఎం హోదాలో కేసీఆర్ కూడా మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ప్రణాళిక తీసుకు వచ్చారు. గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వెయ్యికిపైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారని గుత్తా వివరించారు. ప్రభుత్వ కార్యక్రమానికి మద్దతు ప్రకటించేందుకు ఆయన శుక్రవారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం కరెక్ట్ కాదని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితువు పలికారు. అన్నింటికీ రాజకీయ కోణం విమర్శించడం సమంజసం కాదని, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలని కోరారు. అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు ఇచ్చారు. గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వేయికి పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు. డ్రైనేజ్, నాలాల వ్యవస్థలు గాలికి వదిలి వేశారని తెలిపారు. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com