TG : పట్టువస్త్రంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ

TG : పట్టువస్త్రంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ
X

పట్టు వస్త్రం పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని నేసి నేత కళాకారుడు అబ్బురపరిచాడు. తన చేనేత కళతో ఎన్నో అద్భుతాలు సృష్టించిన సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్..సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టు వస్త్రం పై తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఆయన చిత్రాన్ని వచ్చేలా నేశాడు. రేవంత్ రెడ్డి పై ఉన్న అభిమానంతో దాదాపు ఐదు రోజుల పాటు శ్రమించి వస్త్రాన్ని తయారు చేశానని హరిప్రసాద్ తెలిపాడు. సీఎం పుట్టినరోజు సందర్భంగా సీఎంకు కానుకగా ఈ వస్త్రం తయారుచేశానన్నారు హరిప్రసాద్‌. అవకాశం వచ్చినప్పుడు సీఎంకు ఇస్తానని చెప్పారు.

Tags

Next Story