Harish Rao : ప్రజలనే కాదు.. పార్లమెంట్ను మోసం చేసిండు : హరీశ్ రావు

కేంద్రాన్ని, పార్లమెంటును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు. మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని, కేంద్రం, పార్లమెంటుకు ఒకటి చెప్పి మరొకటి అమలు చేస్తున్నారని ఆరోపించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పా ర్లమెంటుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. 'దేశంలో ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులను ఏ ఆదుకోవాలని 2013లో చట్టం తీసుకొచ్చా రు. దానికంటే మెరుగైన చట్టం అమలు చేస్తే ఆయా రాష్ట్రాలు సొంతంగా కొత్త చట్టాలు తె చ్చుకునే వెసులుబాటు కల్పించారు. బీఆర్ఎ స్ హయాంలో మరింత మెరుగ్గా 2014లో భూసేకరణ చట్టం తీసుకువచ్చాం. నేడు అదే రాష్ట్రంలో అమలులో ఉంది. రేవంత్రెడ్డికి సోనియా గాంధీపై ప్రేమ, గౌరవముంటే.. యూపీఏ తెచ్చిన 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి. అబద్దాల సీఎంపై పార్ల మెంట్లో ప్రివిలేజ్మెషన్ కు మూవ్చేస్తం. మేము 2014 భూసేకరణ చట్టం ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చాం. హైడ్రా ఇప్పటివరకు కూల్చిన ఇండ్ల సంగతి ఏంటి..? ప్రభుత్వం చేసిన పాపానికి శిక్ష ఎవరికి వేయాలి. మూసీ బాధితులను కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ లతో నెట్టి.. గొప్పలు చెప్పుతున్నాడు. మల్లన్న సాగర్లో నేను భూములు ఆక్రమిస్తే విచారణ జరుపుకోచ్చు.. నేను రెడీగా ఉన్న.. ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది.' అని హరీశ్ రావు సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com