Harish Rao : ఏఐజీ హాస్పిటల్‌లో హరీశ్ రావు.. పోలీసులతో వాగ్వాదం

Harish Rao : ఏఐజీ హాస్పిటల్‌లో హరీశ్ రావు.. పోలీసులతో వాగ్వాదం
X

సైబరాబాద్ సీపీ ఆఫీస్ లో నిరసన వ్యక్తం చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి హరీశ్‌రావు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు హరీశ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తన చేయికి గాయం అయిందని, ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు బయటకు వెళ్లాలని పోలీసులకు తెలిపారు.

అయినా పోలీసులు అడ్డుకోగా హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయలైనా చికిత్స పొందే హక్కు తనకు లేదా అని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు దగ్గరుండి మరీ ఆయనను గచ్చిబౌలి ఏఐజీ అసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

మరోవైపు.. నేతల హౌస్‌ అరెస్ట్‌లపై తీవ్రంగా స్పందించారు MLA మాధవరం కృష్ణారావు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా దారుణమన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్ వాతావరణాన్ని నాశనం చేస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. సైబరాబాద్ కమిషనరెట్ ఏర్పడిన నాటి నుంచి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగలేదు అన్నారు MLA మాధవరం కృష్ణారావు.

Tags

Next Story