TG : రేవంత్ కు దమ్ముంటే మాలాగా చేయాలి.. హరీశ్ కొత్త సవాల్

TG : రేవంత్ కు దమ్ముంటే మాలాగా చేయాలి.. హరీశ్ కొత్త సవాల్
X

దమ్ముంటే బీఆర్‌ఎస్‌ హయాంలో చేసినట్లు మూసీ బాధితులకు న్యాయం చేయా లని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్‌ విసిరారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో హరీశ్‌ రావు మాట్లాడారు. మూసీ ఇండ్లు కూల్చి, కేసీఅర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. నాడు కేసీఆర్ ఎలాగైతే భూ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఇచ్చారో.. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా కట్టి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మూసీ బాధితులకు గచ్చిబౌలిలో 250 గజాల స్థలంలో ఇల్లు కట్టి ఇవ్వాలన్నారు హరీశ్.

Tags

Next Story