Harish Rao : దళిత బంధు దేశానికే ఆదర్శ పథకం : మంత్రి హరీష్‌రావు

Harish Rao : దళిత బంధు దేశానికే ఆదర్శ పథకం : మంత్రి హరీష్‌రావు
X
Harish Rao : దళిత బంధు దేశానికే ఆదర్శపథకమన్నారు మంత్రి హరీష్‌రావు.

Harish Rao : దళిత బంధు దేశానికే ఆదర్శపథకమన్నారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణ ఏర్పడ్డాక 50 ఏళ్లలో చేయని అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి హరీష్‌రావు.. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. బెజ్జంకి మండలంలోని రేగులపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ, మహిళా భవనాలను ప్రారంభించారు. చీలాపూర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను లబ్దిదారులకు అందించారు. రెండు కోట్లతో మినీ స్టేడియం, నరసింహస్వామి ఆలయ అభివృద్దికి మరో రెండు కోట్లు నిధులు కెటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి గ్రామంలో నూతన పంచాయతీ భవనం ఏర్పాటు చేయనున్నట్లుమంత్రి పేర్కొన్నారు.

Tags

Next Story