Harish Rao : క్యాంప్ ఆఫీస్‌పై దాడి అప్రజాస్వామికం: హరీశ్ రావు

సిద్దిపేటలోని తన క్యాంప్ ఆఫీస్‌పై దాడి అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ గూండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ‘పోలీసులు దాడులను ఆపాల్సింది పోయి దాడి చేసిన వారినే కాపాడుతున్నారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండాపోతే సాధారణ పౌరులకు ఎలా భద్రత కల్పిస్తారు? దీనిపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొద్దిరోజులుగా డైలాగ్ వార్ నడుస్తోంది. రుణమాఫీ పూర్తి చేశామని, హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వైరా సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. హరీష్ రావుపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. సిగ్గు, లజ్జ ఉంటే రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు.
కాగా, ఆగస్టు 15 నాటికి రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే తాను రాజీనామా చేస్తానని చెప్పానంటున్నారు హరీష్ రావు. ఇందుకు సంబంధించి తన పాత వీడియోలను చూపిస్తున్నారు. ఇక రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదని చెప్తున్నారు హరీష్ రావు. నిబంధనల పేరుతో లక్షల మంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశారని ఆరోపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com