CM Revanth : సెటైర్లు తప్ప పాలన చేతకాదు .. సీఎం రేవంత్ పై హరీశ్​ రావు ఫైర్

CM Revanth : సెటైర్లు తప్ప పాలన చేతకాదు .. సీఎం రేవంత్ పై హరీశ్​ రావు ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వ్యంగ్యం తప్ప పరిపాలన వ్యవహరం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సెటైర్ వేశారు. బుధవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎంఆర్ఎఫ్​ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్​ రావు మాట్లాడుతూ.. ఓర్వలేక ఇక్కడి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. అసెంబ్లీలో కొట్లాడి సిద్ధిపేట అభివృద్ధిని కొనసాగిస్తామన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు వెళ్​లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారని హరీశ్ రావు ఆరోపించారు. రైతు రుణమాఫీ సగం చేసి చేతి ముడుచుకున్నారని.. వానాకాలం ముగుస్తున్నా రైతు బంధు రాలేదన్నారు.వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్లు అందట్లేదని హరీశ్ రావు మండిపడ్డారు. హామీల అమలు, పరిపాలనపై పట్టింపులేదని హరీశ్​ రావు విమర్శించారు.

Tags

Next Story