Harish Rao : చెప్పింది 40వేల కోట్లు.. చేసింది 17వేల కోట్లు: హరీశ్ రావు

ఏ ఊరికి వెళితే ఆ ఊరి దేవుడిపై ఒట్టుపెట్టి పూర్తి రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రైతులను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ( Harish Rao ) అన్నారు. మాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని విమర్శించారు. ‘తొలుత ₹40వేల కోట్లన్నారు. ఆ తర్వాత ₹31వేల కోట్లన్నారు. బడ్జెట్‌లో ₹26వేల కోట్లు పెట్టారు. ఇప్పుడు తీరా ₹17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. అంటే ₹23వేల కోట్లు కోత పెట్టారు’ అని హరీశ్ దుయ్యబట్టారు.
ఇంటింటికీ తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ నేతలతో భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘రాష్ట్రంలో 60శాతం మందికి రుణమాఫీ కాలేదు. ఎల్లుండి నుంచి వివరాలు సేకరిస్తాం. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జిని నియమిస్తాం. కలెక్టర్లకు నివేదికలు సమర్పిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’ అని చెప్పారు.
రుణమాఫీపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ నామమాత్ర రుణమాఫీ చేసిందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రేపటి నుంచి రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com