Harish Rao : బీఆర్ఎస్ విజయాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నది : హరీశ్ రావు

కేసీఆర్ పాలనలో ఎంఎస్ఎంఈలు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కానీ, ఎంఎస్ఎంఈల అభివృద్ధి, బీఆర్ఎస్ సాధించిన విజయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాల్లో వేసుకుంటూ గొప్పలు చెప్పుకోవడం శోచనీయమని విమర్శించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డా.. తెలంగాణ రాష్ట్రంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలు ఎంఎస్ఎంఈలను దృఢంగా నిలిపాయని హరీశ్ రావు చెప్పారు. పెట్టుబడుల్లో 115 శాతం పెరుగుదలతో దేశంలో అగ్రగామిగా నిలవడంతో పాటు, ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం 20 శాతం వృద్ధిరేటు సాధించిందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు 30 శాతం ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధి నమోదు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి చేసిన కృషి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటో చెప్పకుండా గత ప్రభుత్వ విజయాలతో కాలం గడపడం శోచనీయమని హరీశ్‌రావు మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com