Harish Rao: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదు- హరీష్ రావు

X
Harish Rao: బీజేపీ నేతలు అసత్యాలను గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు. పనిచేసే వాళ్లు ఎవరో.. మాటలు చెప్పే వాళ్లు ఎవరో ప్రజలకు తెలిసన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడంలేదన్నారు. ఇప్పటి వరకు కేంద్రంనుంచి 7వేల కోట్లు నిధులు రావాల్సి ఉన్నాయన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి 3లక్షల కోట్లు ఇస్తే,... కేంద్రం మాత్రం కేవలం 1.6 లక్షల కోట్లు మాత్రమే నిధులు రాష్ట్రానికి ఇచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణాకు రావాల్సిన నిధులపై సీఎం కేసీఆర్‌తో పాటు తాను ఎన్నోసార్లు లేఖలు రాసినా కేంద్రం స్పందించడం లేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
