Harish Rao: నల్లధనం తెస్తామనడం, పెద్దనోట్ల రద్దు అంతా మోసం: హరీష్ రావు

X
By - Divya Reddy |20 Jun 2022 7:00 PM IST
Harish Rao: మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు హరీష్‌రావు. ఎనిమిదేళ్ల పాలనలో ప్రతివర్గంపై మోదీ సర్కారు దాడి చేసిందన్నారు.
Harish Rao: మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు మంత్రి హరీష్‌రావు. ఎనిమిదేళ్ల పాలనలో ప్రతివర్గంపై మోదీ సర్కారు దాడి చేసిందంటూ మండిపడ్డారు. నల్లచట్టాలతో రైతుల ఉసురు తీసుకున్నారని.. GST పేరుతో వ్యాపారుల ఉసురు పోసుకున్నారని ఫైర్ అయ్యారు. ఇపుడు అగ్నిపథ్ తెచ్చి యువతను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్.
మరోసారి జగన్ సర్కారు ప్రస్తావన తెచ్చారు హరీష్‌రావు. బావుల కాడ మీటర్లు పెడితే 5వేల కోట్లిస్తామని కేంద్రం ఆఫర్ ఇచ్చిందన్నారు. రైతుల పొట్టకొట్టే రూపాయి కూడా తమకు వద్దని తేల్చి చెప్పామన్నారు. కానీ పక్కరాష్ట్ర సీఎం మాత్రం సంతకం పెట్టారని గుర్తు చేశారు హరీష్. బావుల దగ్గర మీటర్లు పెట్టి ఏడాదికి 7వేల కోట్లు తీసుకుంటున్నారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com