Harish Rao: ఈటల విమర్శలకు హరీష్‌రావు కౌంటర్..

X
Harish Rao : విమర్శలు, ప్రతివిమర్శలతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కింది.. ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి హరీష్‌రావు అభివృద్ధిని వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శల పదును పెంచుతున్నారు. బోతాలపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈటల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
రైతు బంధు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, ఐదు వేల ఇళ్లిస్తామని తాము చెప్తుంటే.. ఈటల మాత్రం బొంద పెడతా, అగ్గిపెడతా, కూలగొడతా అంటున్నాడని మండిపడ్డారు. హుజురాబాద్ ప్రజలు బాగుండాలని మేము కోరుకుంటున్నామని.. తాను గెలవాలి, తానే బాగుండాలని రాజేందర్ కోరుకుంటున్నారని ఫైరయ్యారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలన్నారు మంత్రి హరీష్‌రావు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
