MP Chamala Kiran : హరీశ్ రావుది వన్ సైడ్ లవ్.. ఎంపీ చామల కౌంటర్

కేసీఆర్ కు హరీశ్ రావు మీద ప్రేమ లేదని, హరీశ్ రావుకు మాత్రమే కేసీఆర్ పై చాలా ప్రేమ ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీశ్రరావుది వన్ సైడ్ లవ్ అని అన్నారు. నిన్న గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని కేసీఆర్ నిలబెడితే సీఎం రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనపై హరీశ్ ఏదో ఒక వంతో విష ప్రచారం చేస్తున్నా రని మండిపడ్డారు. మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకెళ్లిన కేసీఆర్ కాదా పడగొట్టింది? పడిపోయిన రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, 200 యూనిట్ల కరెంట్, వడ్లకు రూ. 500 బోనస్, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, రూ.500 సిలిండర్ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టినట్టారు. మీరు రాష్ట్రాన్ని పడగొట్టారు కాబట్టే ఎన్నికల్లో ప్రజలు మిమ్మిల్ని పల్టీ కొట్టించారు. హరీశ్ రావు కళ్లుండి కూడా చూడలేని, చెవులుండీ కూడా వినలేని కబోది. సమాచార లోపం వల్లే కాంగ్రెస్ బీసీ దీక్షకు రాహుల్ గాంధీ రాలేదు. మా పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ గా బీసీ వ్యక్తి ఉన్నారు. బీఆర్ఎస్ లో అలాంటి పరిస్థితి ఉందా. కనీసం బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం రోజు బీసీ వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించండి.' అని చామల సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com