Harish Rao : రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది : హరీశ్ రావు

రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో మాజీ సర్పంచులను హరీశ్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మాజీ సర్పంచులు ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయడం వారు చేసిన తప్పా అని నిలదీశారు. తమ పెండింగ్ నిధుల కోసం సర్పంచులు పోరాడితే వారిని అన్యాయంగా చేశారన్నారు. వడ్డీలకు తెచ్చి, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8నెలలు అవుతున్నా.. గ్రామ పంచాయతీలకు 8పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.‘ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించింది. జ్వరాలతో జనం బాధపడుతున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది. కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్ల సైతం పంచాయతీలకు విడుదల చేయలేదు’ అని హరీశ్ అన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com