TG : కనకపు సింహాసనంపై శునకం కూర్చుంది.. సీఎంపై హరీశ్ రావు ఆగ్రహం

గులాబీ బాస్,మాజీ సీఎం కుక్క చావు చస్తారంటూ మూసీ పాదయాత్ర సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన తీవ్రవ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ కాలి గోటికి సీఎం రేవంత్‌రెడ్డి సరిపోరని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయి దిగజారి మాట్లాడారంటూ మండిపడ్డారు. కనకపు సింహాసనం మీద శునకమును కూర్చోబెడితే అన్న పద్యం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. మూసీ నీళ్ల మురికితో కడిగినా.. రేవంత్‌రెడ్డి నోరు మురికి పోదనీ.. ఆయన వంకర బుద్ధి ఇక మారదన్నారు. బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచ్చిన నీచ చరిత్ర రేవంత్‌రెడ్డి అంటూ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. పిచ్చి ప్రగల్బాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలంటూ హరీశ్‌రావు హితవు పలికారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com