Kaushik Reddy : కౌశిక్ రెడ్డికి అండగా రంగంలోకి హరీశ్ రావు

Kaushik Reddy : కౌశిక్ రెడ్డికి అండగా రంగంలోకి హరీశ్ రావు
X

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని వెంటనే సిద్దిపేట నుండి బయలుదేరారు హరీష్ రావు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.

తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

ఈ ఉదయం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం రణరంగంగా మారింది. బీఆర్ఎస్,కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తనకు సవాల్ చేసిన కౌశిక్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటానంటూ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ. తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్ తో వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోగానే గాంధీ అనుచరులు రెచ్చిపోయారు. కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లతో దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకువెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం వేశారు. రాళ్ల దాడి చేయడంతో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.

Tags

Next Story