TG : జైనూర్ బాధితురాలికి హరీశ్, సబిత పరామర్శ.. ప్రభుత్వంపై విమర్శలు

TG : జైనూర్ బాధితురాలికి హరీశ్, సబిత పరామర్శ.. ప్రభుత్వంపై విమర్శలు

జైనూర్ బాధితురాలిని గాంధీ హాస్పిటల్ లో పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

ప్రతి రోజూ 2 హత్యలు, 4 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయన్నారు హరీశ్ రావు. ముఖ్యమంత్రి దగ్గరే హోం శాఖ ఉందన్నారు హరీష్ రావు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అసిఫాబాద్ జిల్లా జైనూరులో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయన్నారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించడంపై ఫోకస్ చేసి పాలనను గాలికొదిలేశారని హరీష్ రావు విమర్శించారు.

Tags

Next Story