Minister Seethakka : విద్వేషం, విధ్వంసం ఇదే బీజేపీ విధానం : మంత్రి సీతక్క

కులగణన అంశాన్ని డైవర్ట్ చేయడానికే బండి సంజయ్ రాహుల్ గాంధీ మతంపై మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో విధ్వంసం సృష్టించడమే బీజేపీ విధానమని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి ప్రజల సంక్షేమం, బాగు కోసం చేసింది ఏమీ లేదన్నారు. రాహుల్ గాంధీపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మతం, అభిమతం కుల గణన అని అన్నారు. దమ్ముంటే బీజేపీ దేశంలో జనగణన, కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 'దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతం. కులగణన అంశాన్ని పక్క దారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడు .. 30 ఏండ్లుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పనిచేస్తున్నారు. బీజేపీ విద్వేష విద్వాంసాలు కావాలో.. కాంగ్రెస్ శాంతి, సమానత్వం, అభి వృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలి. విభజన రాజకీయాలతో పదవులు పొందటం బీజేపీ నా యకులకు అలవాటే. రాహుల్ గాంధీ పదవుల కోసం పాకులాడే మనిషి కాదు. మీ నాయకుడి లాగా ఆదానీ ఆస్తుల పెంచడం కోసం రాహుల్ గాంధీ పనిచేయటం లేదు. పేద వర్గాల అభ్యున్న తి, అంతరాలు లేని సమాజమే మా నాయకుడి లక్ష్యం. అణగారిన వర్గాలు, పేద ప్రజలంటే బీజేపీకి పట్టదు. దేశ ప్రజలంతా బీజేపీ నైజాన్ని గ్రహిస్తున్నారు' అని సీతక్క అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com