Hyderabad : హైదరాబాద్‌లో HCL కొత్త టెక్ సెంటర్

Hyderabad : హైదరాబాద్‌లో HCL కొత్త టెక్ సెంటర్
X

హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ ముందుకొచ్చింది. హైటెక్ సిటీలో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని HCL ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న WEFలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుతో 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్‌తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.

హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్‌ అందుకుంది. దీంతో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, ఐటీలో ప్రతిభా వంతులైన నిపుణులతో ఇప్పటికే హెచ్​సీఎల్ గ్లోబల్ నెట్​ వర్క్​ సెంటర్​ గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కొత్త సెంటర్ మరింత అత్యాధునిక సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని హెచ్​సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ అభిప్రాయపడ్డారు.

Tags

Next Story