Sri Tej Health Bulletin : శ్రీతేజ్ కండిషన్ ఇదీ.. హెల్త్ బులెటిన్ విడుదల

Sri Tej Health Bulletin : శ్రీతేజ్ కండిషన్ ఇదీ.. హెల్త్ బులెటిన్ విడుదల
X

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్‌కు గత పది రోజులుగా చికిత్స కొనసాగుతోంది. వైద్యులు నిరంతరం అతనిని పర్యవేక్షిస్తున్నారు. తాజాగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు తెలిపారు. అతని జ్వరం పెరుగుతోంది. కానీ మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని తెలిపారు. ఫీడ్‌లను బాగానే తట్టుకుంటున్నాడని వెల్లడించారు. అలాగనీ అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాని మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు.

స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నాం. శ్రీతేజ్‌కు మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నాం. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అని వైద్యులు తెలిపారు.

Tags

Next Story