Minister Ponguleti : హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ కావాలె : మంత్రి పొంగులేటి

Minister Ponguleti : హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ కావాలె : మంత్రి పొంగులేటి
X

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ మేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసు కోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధి కారులను ఆదేశించారు. ఈ ఏడాది ఎండలు, వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని, జూన్ వరకు కూడా అధిక ఉష్ణోగ్రత లు ఉంటాయన్న ఐఎండి హెచ్చరికల నేపథ్యం లో తీసుకోవలసిన చర్యలపై 12 సంబంధిత శాఖలతో ఆయన ఇవాళ సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, భారత వాతా వరణ శాఖ కలిసి సమగ్ర తెలంగాణ స్టేట్ హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ రూపొందించాయని, ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమిం చారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 588 మండ లాలను వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరించామని తెలిపారు.

Tags

Next Story