Jurala Project : జూరాలకు భారీగా చేరుతున్న నీరు

Jurala Project : జూరాలకు భారీగా చేరుతున్న నీరు
X

జోగులాంబ్ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. సోమవారం అధికారులు అందించిన వివరాలు ప్రకారం.. ప్రాజెక్టులోకి 3లక్షలకు పైగా క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి 2,74,364 క్యూసెక్కులు స్పిల్వే ద్వారా కిందకు విడిచిపెడుతున్నారు.

విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19,044 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్ కు 1300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. అలాగే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 820 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 578 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ఇప్పుడు 317.040 మీటర్లుగా ఉంది. అదేవిధంగా ప్రాజెక్టులో 9.65 టీఎంసీల నీటి నిల్వకు గాను ప్రస్తుతం 7.875 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు నుంచి స్పిలే, విద్యుత్ ఉత్పత్తికి, కుడి, ఎడమ కాలువలు, అలాగే నెట్టెం పాడు, భీమా లిఫ్ట్ కు మొత్తం 2,97,499 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

Tags

Next Story