Telangana weather: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana weather: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు నిజామాబాద్‌ వరకు విస్తరించాయని తెలిపింది. రాగల ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా మంచాలలో 55.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శుక్రవారం నిర్మల్‌ జిల్లా మండాలో రాష్ట్రంలోనే అత్యధిక పగటిపూట ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలు నమోదు అయింది. అన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ పరిధిలో రికార్డుస్థాయిలో 8.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా చిరు జల్లుల వాన కురుస్తోంది. మెట్ట పంటల విత్తనాలు విత్తడానికి ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా తిప్పర్తి మండలంలో 29.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యాదగిరిక్షేత్రంలో వర్షం కురిసి పార్కింగ్‌ స్థలమంతా బురదమయంగా మారటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags

Next Story