Cyberabad Police Advise : సైబరాబాద్‌కు భారీ వర్షసూచన.. ఐటీ కంపెనీలకు పోలీసుల కీలక సూచన

Cyberabad Police Advise : సైబరాబాద్‌కు భారీ వర్షసూచన.. ఐటీ కంపెనీలకు పోలీసుల కీలక సూచన
X

చినుకు పడితే హైదరాబాద్ మొత్త చిత్తడి అవుతుంది. మొన్నటి వర్షానికి నగరం అల్లకల్లోలం అయ్యింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు వాహనాలు సైతం వరద నీటిలో కొట్టుకపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో గంటల కొద్దీ రోడ్లపై ప్రజలు నరకం చూశారు. ఇవాళ సైబరాబాద్‌ ప్రాంతంలో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఐటీ కంపెనీలు ఇవాళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతిని పాటిస్తే మేలని సూచించారు. ఈ విషయంలో కంపెనీలు సహకారం అందించాలని కోరారు.

Tags

Next Story