HYD Weather: హైదరాబాద్‌లో భారీ వర్షం

X
By - Bhoopathi |25 Jun 2023 1:15 PM IST
రాత్రి హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలదిగ్భదంలో చిక్కుకున్నాయి.
రాత్రి హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలదిగ్భదంలో చిక్కుకున్నాయి. ఇండ్ల ముందు వరద నీటితో పాటు బురద కూరుకుపోవడంతో జనాలు బయటకు రాలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు SNDP పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. నాలాల పనులు పూర్తికాకపోవడంతోనే తమకు ఈ ఇబ్బందులం టూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద నీటితో మన్సూరాబాద్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే ఇండ్లు ఖాళీ చేసి మరో కాలనీకి వెళ్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com