TG : హైదరాబాద్‌లో రాత్రి కుండపోత.. చెరువులైన బజార్లు

TG : హైదరాబాద్‌లో రాత్రి కుండపోత.. చెరువులైన బజార్లు

హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి పదిన్నర గంటలకు ఉన్నట్టుండి కుండపోత వర్షం కురిసింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టే భారీవర్షం భయపెట్టింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఏకధాటిగా వర్షం కురిసింది. నగరం అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.

నగరంలోని ప్రధాన కూడళ్లయిన మెహిదీపట్నం, టోలీచౌకీ, బంజారాహిల్స్, గోల్కొండ, అమీర్ పేట, సంజీవరెడ్డి నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, నిజాంపేట్, ఇటు కోఠి, అబిడ్స్, అటు వనస్థలిపురం, ఉప్పల్ వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసిన తరువాత వరుణుడు శాంతించినట్టే కన్పించాడు. బుధవారం ఉదయంనుంచి పెద్దగా వర్షం కురియలేదు. అక్కడక్కడ చిన్నపాటి తుంపర పడింది. కానీ రాత్రి పదిన్నర నుంచి గంటపాటు వర్షం కుమ్మేసింది.

అమీర్ పేట వంటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సు ప్రయాణీకులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలుపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా జల్లులు పడ్డాయి.

Tags

Next Story