TG : భారీ వర్షాల కారణంగా 580 అంగన్వాడీ భవనాలు ధ్వంసం

TG : భారీ వర్షాల కారణంగా 580 అంగన్వాడీ భవనాలు ధ్వంసం
X

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు భారీ నష్టం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేసి సీఎస్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. సొంత భవనాల్లో నడుస్తున్న 440 అంగన్వాడీ కేంద్రాలు, రెంట్ ఫ్రీ భవనాల్లో నడుస్తున్న మరో 140 కేంద్రాలు కలిపి మొత్తం 580 భవనాలు వర్షాల ప్రభావం తో దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. పైకప్పుల లీకేజీలు, గోడలు, బేస్మెంట్ లో పగుళ్లు, ఫ్లోర్ దెబ్బతినడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించాయి. సొంత భవనాల మరమ్మతులకు రూ.14 కోట్లు, రెంట్ ఫ్రీ భవ నాలకు రూ. 3 కోట్లు ఖర్చవుతుందని అధికారు లు లెక్కగట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, కామారెడ్డి, గద్వాల్, హనుమకొండ, మెదక్, వనపర్తి, ఆసిఫాబాద్, ములుగు వంటి జిల్లాల్లో వందల సంఖ్యలో అంగన్వాడీ భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు లోపలకు చేరడంతో బియ్యం, పప్పులు, పాల డబ్బులు, నూనె ప్యాకెట్లు, స్టడీ మెటీరియల్ తడిసి ముద్దయ్యాయి. ఈ నేపథ్యంలో తడిసిన భవనాల్లో అంగన్వాడీ సేవలు తక్షణం నిలిపి వేయాలని, సమీపంలోని ప్రభుత్వ భవనాలు లేదా పాఠశాల ప్రాంగణాల్లో కేంద్రాలను తా త్కాలికంగా తరలించాలని మంత్రి సీతక్క అధి కారులు ఆదేశించారు. అలాగే తడిసిపోయిన సరుకుల బదులుగా వెంటనే కొత్త సరుకులను సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

Tags

Next Story