Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన .. వచ్చే 5 రోజులు వానలు

Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన .. వచ్చే 5 రోజులు వానలు
X

తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 21 వరకు పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని చెప్పింది. ప్రస్తుతం బంగాళాఖాతం చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, ఏపీలోని నెల్లూరుకు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాల మధ్యనున్న పుదుచ్చేరి, నెల్లూరు మధ్య గురువారం తెల్లవారు జామున చెన్నైకి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.ఇక రాష్ట్రంలో బుధవారం నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు కురిసేందుకు అవకాశం ఉందని ప్రకటించింది. శుక్రవారం ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Tags

Next Story