Heavy Rains : రెండురోజుల్లో అల్పపీడనం.. నెలాఖరు వరకు భారీ వర్షాలు

Heavy Rains : రెండురోజుల్లో అల్పపీడనం.. నెలాఖరు వరకు భారీ వర్షాలు
X

ఈ నెల 31 వరకు అయిదు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్లు జారీ చేసింది. ఈ నెల చివరి వారంలో తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని తెలిపింది.

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 27న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మ కొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 28న ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది.

ఈ నెల 29, 30 తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ నాలుగు రోజులపాటు హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags

Next Story