తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు..!

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోడమూరు మండలం వర్కూరు దగ్గర తుమ్మల వాగు ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో వాగులో హెచ్ పీ గ్యాస్ లారీ ఇరుక్కుపోయింది. లారీ డ్రైవర్‌ను స్థానికులు అతికష్టం మీద రక్షించారు. భారీ వర్షానికి ఆదోని డివిజన్ పరిధిలో జనజీవనం స్తంభించిపోయింది.
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. ముగతిపేట, లక్ష్మీనగర్, శివన్ననగర్. వీవర్స్ కాలనీల్లో నీరు చేరింది. చేనేత మగ్గాలు తడిచిపోయి నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షా ల ధాటికి పచ్చరంగులో ఉండే కప్పలు ప్రత్యక్షమవుతున్నాయి. మంత్రాలయం మండలం రచ్చు దగ్గర వంకలు పోంగి పోర్లుతున్నాయి.
ఆదోని నియోజకవర్గంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయచూర్ ఆదోని వెళ్లే దారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తుమ్మలవాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. విస్తారంగా వర్షాలు కురువడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com