TG : రంగారెడ్డి జిల్లాలో భారీవర్షాలు.. జంట జలాశయాల నుంచి నీటి విడుదల

TG : రంగారెడ్డి జిల్లాలో భారీవర్షాలు.. జంట జలాశయాల నుంచి నీటి విడుదల

రంగా రెడ్డి జిల్లా పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌ నగరానికి నీరందించే జంట జలాశయాలు నిండుకుండ లా మారాయి. ఈ క్రమంలోనే ఉస్మాన్ సాగర్ జలాశయానికి ప్రవాహం మరింత పెరిగింది. ఉస్మాన్ సాగర్ అంటే గండిపెట్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం ఆ స్థాయికి చేరింది. దీంతో ఉదయం 6 గేట్లు , 2 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో 1428 క్యూసెక్కు ఔట్ ఫ్లో ను మూసీ నదిలోకి వదులుతున్నారు. దీంతో దిగువ ప్రాంతాల వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. పర్యటకులు ఎవరూ రాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు.

Tags

Next Story