Heavy Rains : తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు

Heavy Rains : తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు
X

తెలంగాణలో రేపటి నుంచి వర్షాలు మొదలవుతాయని వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. రేపటితో వడగాలులు ముగుస్తాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని, ముఖ్యంగా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని వివరించారు.మరోవైపు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాలలో 45.3, ఆదిలాబాద్-45.2, నిర్మల్-45.2, మంచిర్యాల-45.1, ఆసిఫాబాద్-45, నల్గొండ-44.9, కామారెడ్డి-44.6, కరీంనగర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొట్టాయి. ఐఎస్ సదన్‌లో అత్యధికంగా 42, మాదాపూర్‌లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Tags

Next Story