TG Heavy Rains : రాష్ట్రంలో 5 రోజులు భారీ వర్షాలు

TG Heavy Rains : రాష్ట్రంలో 5 రోజులు భారీ వర్షాలు
X

తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు సూచనలు ఉన్నాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లా, నల్గొండ, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేడు భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి (జూన్ 12) మహబూబ్నగర్, వికారాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. దీంతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ల్న జారీ చేసింది.

సోమ, మంగళ వారాల్లో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం. సృష్టించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. పార్కింగ్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులతో కరెంట్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన విద్యుత్, పోలీసు అధికారులు రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించారు. నిర్మల్ జిల్లాలో వర్షాలకు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పట్టణంలోని ద్యాగవాడ, షేక్ పేట కాలనీల్లో కారు, ఆటోపై చెట్టు విరిగిపడింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story