Rains in Telangana : రాత్రి 7 నుంచి దంచికొట్టిన వాన.. పాటిగడ్డలో అత్యధిక వర్షపాతం

Rains in Telangana : రాత్రి 7 నుంచి దంచికొట్టిన వాన.. పాటిగడ్డలో అత్యధిక వర్షపాతం
X

హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. రాత్రి 7 గంటల నుంచి దాదాపు గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సిటీ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కుండపోత వర్షానికి పలు చోట్లు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒక్కసారిగా వర్షం పడటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. రాత్రి 9 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు సికింద్రాబాద్ పాటిగడ్డలో 7.8 సెంటీమీటర్లు.. రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో 9.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

ఇటు కూకట్ పల్లి, మూసాపేట్, అమీర్ పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో గాలి దుమారంతో కుండపోత వర్షం పడింది. అటు ఉప్పల్, రామంతపూర్, చిల్కానగర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్ లో వర్షం దంచికొట్టింది. నాచారం, మల్లాపూర్, తార్నాక, లాలాపేట్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్ లోని దుండిగల్, సుచిత్ర, బాచుపల్లి, బాలానగర్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ లో ఈదురు గాలులతో వర్షం పడింది. కీసర, కుషాయిగూడ, మల్కాజిగిరి, నేరెడ్ మెట్, చర్లపల్లి, మౌలాలి, సైనిక్ పురి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి.

అటు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, గాంధీనగర్, రాంనగర్, అశోక్ నగర్, ట్యాంక్ బండ్, నారాయణగూడలో ఎడతెరపిలేకుండా వర్షం పడింది. బషీర్బాగ్, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, ఆఫ్జల్ గంజ్, నాంపల్లి, తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు, రామచంద్రపురం, తెల్లాపూర్, BHEL, అమీన్ పూర్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల డివిజన్ లో గాలి దుమారంతో వర్షం పడింది. అటు రాష్ట్రానికి మరో మూడు రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు.

Tags

Next Story