Jainoor : జైనూర్‌లో అత్యంత సున్నిత పరిస్థితులు.. భారీగా బందోబస్తు మోహరింపు

Jainoor : జైనూర్‌లో అత్యంత సున్నిత పరిస్థితులు.. భారీగా బందోబస్తు మోహరింపు
X

ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా జైనూరులో విధ్వంసం, భారీగా ఆస్తి నష్టం ఉద్రిక్తత ఘటనల నేపథ్యంలో పోలీసులు ఏజెన్సీ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో తెచ్చుకున్నారు. బుధవారం జైనూర్ లో ఇరువర్గాల ఘర్షణలు, షాపులు వాహనాలకు నిప్పుపెట్టిన ఘటన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసింది. గురువారం మధ్యాహ్నం వరకు దుకాణాలు కాలుతూ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అధికారులు అగ్నిమాపక శకటాలను రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

కర్ప్యూ నిషేదాజ్ఞల నడుమ పరిస్థితిని అదుపులోకితెచ్చేందుకు అదనపు డిజి లాఅండ్ ఆర్డర్ మహేష్ భగవత్ డిఐజి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. గిరిజన మహిళపై జరిగిన లైంగికదాడి ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఇరువర్గాలు సంయమనం పాటించాలని నిందితున్ని, ఇప్పటికే జుడిషియల్ రిమాండ్ కు పంపించామని ఐజి మహేష్ భగత్ వివరించారు. మత ఘర్షణలతో అమాయకులే బలి అవుతారని, సామాన్య ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. మత పెద్దలతో చర్చించిన అనంతరం ఉమ్మడి జిల్లా ఏజెన్సీవ్యాప్తంగా ముందు జాగ్రత్తలపై పోలీసు అధికారులతో సమీక్షించారు.

కొమరంభీం జిల్లాలో ఇంటర్నెట్ సేవలు బంద్ జైనూర్ ఘటన అనంతరం సోషల్ మీడియాలో మత విద్వేషాలకు సంబంధించి పలు వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో ముందు జాగ్రత్తచర్యగా పోలీసులు బుధవారం అర్ధరాత్రి నుండే ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి ఉట్నూర్ మార్గంపై రాకపోకలు నిలిపివేసి ప్రధాన కూడళ్ల వద్ద ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాన అవుట్ పోస్టులు ఏర్పాటుచేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపి వేశారు.

అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ ఆధ్వర్యంలో జైనూర్లో ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పోలీసుబలగాలు మోహరించాయి. జరిగిన ఘటన వాస్తవ పరిస్థితులపై ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్త్రే పోలీసు అధికారులకు వివరించారు. రాపిడ్ యాక్ష ఎన్ ఫోర్స్ బలగాలు, మహిళ పోలీసులు రంగంలోకి దిగి ప్లాగ్ మార్చ్ నిర్వహించాయి. శాంతి సంయమనం పాటించాలని పోలీసులు పదే పదే కోరారు. సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, అదిలాబాద్ ఎస్పీ గౌస్ బందోబస్తులో జగిత్యాల ఎస్సీ అశోక్ కుమార్, ఆలం, బాలానగర్ డిసిబి సురేష్ కుమార్,అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 1200ల మంది పోలీసులు బందోబస్తు విధులకు హాజరయ్యారు.

జై నూర్ విధ్వంస ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రధాన రహదారులపై నిఘా ముమ్మరం చేశారు. ముందు జాగ్రత్తగా బీజెపి ఆదివాసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచారు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మీడియాతో మాట్లాడుతూ ఇరువర్గాలు శాంతియుతంగా ఉండాలని బాధితు రాలికి పూర్తి వైద్యం ప్రభుత్వమే భరిస్తుందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని అన్నారు. జైనూర్ ఘటనలో బాధితులను పరామార్శించేందుకు వెళుతున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీని పోలీసులు అడ్డుకుని వెనక్కిపంపారు.

Tags

Next Story