TG High Court : కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు

TG High Court : కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు
X

సైఫాబాద్ పీఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన కేసును ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డినీ కించపర్చే విధంగా మాట్లాడారని. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సైఫాబాద్ పీఎస్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టులో వాదనల సందర్భంగా.. బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడార పీపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని చెప్పారు. ఈ కేసులో రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది అన్నారు. కేసులో నిజం లేదన్నారు. ఇరువైపులా వాదనల ను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఎఫ్ఎఆర్ ను కొట్టేసింది.

Tags

Next Story