Hydra : హైడ్రాకు హైకోర్టు వార్నింగ్ ఇచ్చిందా.. ఆదేశాల్లో ఏముందంటే?

Hydra : హైడ్రాకు హైకోర్టు వార్నింగ్ ఇచ్చిందా.. ఆదేశాల్లో ఏముందంటే?

హైడ్రాపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లో ఎలా కూల్చివేశారని కోర్టు ప్రశ్నించింది. అమీన్‌పూర్‌లో భవనం కూల్చివేతపైనే హైకోర్టు ప్రశ్నించింది. వర్చువల్‌గా హాజరైన హైడ్రా కమిషనర్‌కు ప్రశ్నల వర్షం కురిపించింది. చార్మినార్‌ను, హైకోర్టును కూల్చేయాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్‌ ఫిక్స్‌ చేశారని ప్రశ్నించింది. ఆదివారం నాడు ఎలా కూల్చివేస్తారని అమీన్‌పూర్‌ ఎమ్మార్వోపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్వో సమాధానంపై హైకోర్టు సంతృప్తి చెందలేదు.

దీనిపై హైడ్రా కీలక ట్వీట్ చేసింది. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదని స్పష్టం చేసింది. అక్కడ ఎలాంటి కూల్చివేతలను తాము చేపట్టడం లేదని హైడ్రా తెలిపింది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అనీ.. దీనిని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప‌మెంట్‌ కార్పొరేషన్‌ చేపడుతోందని హైడ్రా తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

Tags

Next Story