Telangana High Court : నలుగురు కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు

Telangana High Court : నలుగురు కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు
X

రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 నెలలకే పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం ఏడాది దాటినా పట్టించుకోలేదని కొండల్ రెడ్డి అనే వ్యక్తి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు ధిక్కరణ కింద ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద ఈ పిటిషన్‌ను ఎందుకు స్వీకరించకూడదో చెప్పాలని హైకోర్టు నోటీసుల్లో పేర్కొంది. తమకు కలెక్టర్లు వెంటనే జవాబులు ఇవ్వాలని ఆదేశించింది.

Tags

Next Story