TG High Court : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 2021లో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈక్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 4న హైకోర్టులో రాజగోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో 2021 జూలై 26న మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలోని మైక్ లాక్కొని ప్రభుత్వ కార్యక్రమానికి అడ్డు పడ్డారనే ఆరోపణలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చౌటుప్పల్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం నిర్వహించిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఘర్షణ నెలకొంది. అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రొటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వ కుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ రాజగోపాల్రెడ్డి మంత్రి చేతిలోంచి మైకు లాక్కున్నారు. అయితే, ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించ కుండా అడ్డుపడ్డారంటూ మంత్రి ఆదేశాల మేరకు తహసీల్దార్ ఫిర్యాదు ఆధారంగా రాజగోపాల్ రెడ్డిపై చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రాజ గోపాల్ రెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. తాజాగా ఈ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com