Kaushik Reddy : కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా.. భారీగా పోలీసుల మోహరింపు

Kaushik Reddy : కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా.. భారీగా పోలీసుల మోహరింపు
X

హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర హై టెన్షన్ కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి బయటికి రాకుండా పోలీసులు అతని ఇంటిని దిగ్బంధనం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి అనుచరులు ఆందోళన చేస్తున్నారు.

మరోవైపు.. అరికెపూడి ఇంటి దగ్గర హడావుడి కొనసాగుతోంది. భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు...కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Tags

Next Story