Himansh Post : కేసీఆర్ పై హిమాన్ష్ పోస్ట్ వైరల్

Himansh Post : కేసీఆర్ పై హిమాన్ష్ పోస్ట్ వైరల్
X

తాత గురించి మనవడు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు తన తాత కేసీఆర్ తో కలిసి వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటాడు. ఇందుకు సంబంధించిన 40 సెకన్ల వీడియోను అతను తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. హిమాన్షు పారను పట్టుకొని గుంత తవ్వుతుండగా కేసీఆర్ పక్కనే నిలబడి సూచన చేస్తున్నారు. గుంతను తవ్వి, ఓ మొక్కను నాటి ఆ తర్వాత దానికి నీరు పోశాడు. ఆ తర్వాత అదే పారతో... చెట్టు నాటిన గుంతను మట్టితో నింపేశాడు. ఈ వీడియోకు 'లెర్నింగ్ ఫ్రమ్ ది బెస్ట్' అని కేసీఆర్‌ను ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చాడు. చెట్లు పెంచడం ఎంతో అవసరమని, మన సహజ వనరులను రక్షించడం... సంరక్షించడం మన బాధ్యత అని ఎక్స్ వేదికగా వీడియోను పోస్ట్ చేశాడు.

Tags

Next Story