MLC Kavitha : బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే.. ఎన్నికలు పెట్టాలి : కవిత

MLC Kavitha : బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే.. ఎన్నికలు పెట్టాలి : కవిత
X

బీసీలకు 40శాతం రిజర్వేషన్లు అమలుచేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మంలో ఆమె పర్యటించారు. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్నికలకు వెళ్తే ఊరుకునేది లేదన్నారు. ఈ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా రైల్ రొకో కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని రైల్ రొకోని సక్సెస్ చేయాలని కవిత కోరారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒప్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని కవిత మండిపడ్డారు. ఇంతవరకు ఒక్క గ్యారెంటీని కూడా సరిగ్గా అమలు చేయలేదని ఆరోపించారు. పైగా ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కేసుల మీద ఫోకస్ పెట్టడం మానేసి ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కవిత సూచించారు.

Tags

Next Story