Govt Holidays : 7, 17న సెలువులు.. ఉత్తర్వులు జారీ

Govt Holidays : 7, 17న సెలువులు.. ఉత్తర్వులు జారీ

ఈ నెలలో రానున్న సెలవులను రాష్ట్ర అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 7, 17న సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటించింది.

సెప్టెంబర్ 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు ఇచ్చింది. సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ సెలవు ఉంది. అయితే దీన్ని సెప్టెంబర్ 17కు మార్చారు. నెలవంక దర్శనం 17న కనిపించనుంది. దీంతో మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీని మార్చారు.

వినాయక నిమజ్జనం రోజు కూడా సెలవు ప్రకటించింది. అయితే అదే రోజు మిలాన్ ఉన్ నబీ ఉంది. దీనికే సెలవు ప్రకటించారు. అదే రోజు జరిగే మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ వాయిదా వేసినట్లు తెలిసింది. సెప్టెంబర్ 19న మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ నిర్వహించే అవకాశం ఉంది. వర్షాల కారణంగా ఇచ్చిన సెలవును కవర్ చేయాల్సి ఉంది. వచ్చే నెలలో గాంధీ జయంతి, దసరా పండులకు సెలవులు ఉన్నాయి. విద్యా సంస్థలకు బతుకమ్మ, దసరా పండుగకు వారం రోజులకు పైగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.

Tags

Next Story