Telangana : HT విద్యుత్ కనెక్షన్ల జారీ మరింత సులభం

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ, తమ వినియోగదారులకు సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలను త్వరితగతిన అందించేందుకు గాను. 33 కేవీ కొత్త HT సర్వీసు దరఖాస్తుల కోసం ఆటో ఎస్టిమేట్ సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసిందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ తెలిపారు.
ఈ విధానం లో ముందుగా నూతన HT సర్వీసు కు దరఖాస్తు చేసిన తరవాత హై టెన్షన్ కన్స్యూమర్ సర్వీస్ కనెక్షన్ (HTCSC) సిస్టమ్ GIS కోఆర్డినేట్లను సేకరించి ఆ వివరాలను SASA యాప్ ద్వారా డైరెక్ట్ గా సంస్థ ప్రధాన కార్యాలయం లోని చీఫ్ ఇంజినీర్ కమర్షియల్ కు పంపుతుంది.
ఈ సమాచారం కార్పొరేట్ ఆఫీస్ కు అందగానే SASA యాప్ ద్వారా నేరుగా ఎస్టిమేట్ రూపొందించబడుతుంది. ఎస్టిమేట్ ఆమోదం తర్వాత డిమాండ్ నోటీసు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఆ వివరాలు వినియోగదారుడికి SMS మరియు ఈమెయిల్ ద్వారా పంపబడతాయి. ఆటో ఎస్టిమేట్ ఆమోదం అయిన విషయాన్ని సంబంధిత ADE DE మరియు SE ఆపరేషన్ సిబ్బందికి SMS ద్వారా తెలియజేయబడుతుంది. ఈ సింగల్ విండో పద్ధతిలో జరిగే ఈ ప్రక్రియ వలన అతి తక్కువ సమయంలో అన్ని అనుమతులు జారీ అవుతాయి.
సంస్థ సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరియు గౌరవ ఉప ముఖ్య మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గార్ల సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్యూచర్ సిటీ. పరిశ్రమల విస్తరణ వంటి వివిధ అభివృద్ధి పనుల వలన ముఖ్యంగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధి ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుందన్నారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుదారులు. సాఫ్ట్వేర్ సంతల యాజమాన్యాలకు HT కనెక్షన్లు మరింత సులభంగా అందించేందుకు సంస్థ "ఆటో ఎస్టిమేట్ సాఫ్ట్వేర్ సిస్టం ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఔత్సహిక పారిశ్రామికవేత్తలు ఈ విధానంలో నేరుగా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులు నేరుగా ప్రధాన కార్యాలయానికి వస్తాయని వాటిని పరిశీలించిన వున్నత అధికారులు కనెక్షన్ కు సంబందించిన ఎస్టిమేట్ లు రూపొందించి ఆ వివరాలను సంబంధిత యాజమాన్యాలకు మెయిల్ రూపంలో అందజేయబడతాయన్నారు.
ఈ విధానంతో యావత్ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయబడి ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com