తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న కరోనా కేసులు..!
తెలుగు రాష్ట్రాలను కరోనా మరోసారి భయపెడుతోంది. ఇప్పటి వరకు పక్కనున్న కర్నాటక, మహారాష్ట్రను కరోనా వణికిస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంతటి పరిస్థితి లేదు. కాని, గత పది, 15 రోజుల నుంచి పరిస్థితులు మారుతున్నాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పాజిటివ్‌ల సంఖ్య రెట్టింపయింది.
తెలంగాణలో తాజాగా 42వేల 461 పరీక్షలు చేయగా 463 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 7వేల 205కి చేరింది. కొత్తగా నలుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1694కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 4వేల 678 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు వచ్చాయి.
ఏపీలో అయితే కరోనా విజృంభిస్తోంది. ఒకప్పుడు రోజుకు వేయి కేసులు నమోదయ్యేవి. మళ్లీ అలాంటి రోజులే వస్తాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీలో 31వేల 324 టెస్టులు చేస్తే అందులో 997 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 99వేల 812కి చేరింది. కొత్తగా ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 7వేల 210కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 5వేల 104 యాక్టివ్ కేసులున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఆ ఆరు రాష్ట్రాలతో పోల్చితే తక్కువే. మహారాష్ట్రలో అయితే ఏకంగా రోజుకి 30వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాకపోతే.. నిన్న మొన్నటి వరకు అటుఇటుగా రోజుకు వంద కేసులు నమోదయ్యేవి. ఇప్పుడవి 500లకు చేరువవుతున్నాయి. అదే ఏపీలో అయితే.. వేయికి చేరువవుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com