coronavirus : తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కరోనా ఉధృతి..!

coronavirus : తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కరోనా ఉధృతి..!
coronavirus : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,16,224 టెస్టులు చేయగా 4,393 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.

coronavirus : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,16,224 టెస్టులు చేయగా 4,393 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 7,31,212కి చేరింది. ఇక కరోనా నుంచి మరో 2,319 మంది కోలుకున్నారు. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. రికవరీ రేటు 95.18శాతంగా ఉంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,643 కేసులు నమోదయ్యాయి.

అటు ఏపీలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 43,763 టెస్టులు చేయగా 12,926 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనాతో మరో ఆరుగురు మృతి చెందారు. ఇక కరోనా నుంచి కొత్తగా 3, 913 మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 73,143 పాజిటివ్ కేసులున్నాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,959, చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story