Hyderabad: భారీ డ్రగ్స్ దందా

హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మెఫంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. మెఫంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న సోహైల్, నితీష్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు సోహైల్, నితీష్ జిమ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెఫంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌ను 300 కొనుగోలు చేసి వెయ్యి నుంచి 14వందల వరకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తరహా ఇంజెక్షన్‌ను ఎక్కువగా ఆపరేషన్ థియేటర్లలో ఉపయోగిస్తారని... శరీరంలో రక్త ప్రసరణ స్థాయిలు తగ్గినప్పుడు వాటిని పెంచడానికి ఈ మెడిసిన్ వినియోగిస్తారని చెప్పారు. వైద్యుల సూచన మేరకే ఈ ఇంజెక్షన్లు వాడాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com