Tomato Price : మళ్లీ మోత మోగిస్తున్న టమాటా ధర.

వర్షాకాలం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మటన్, చికెన్ ధరలకు పోటీగా కూరగాయాల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు జేబులకు చిల్లుపడుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కూరగాయాల ధరలు ఆకాశానంటుతున్నాయి. పండుగ వేళ కావడంతో మార్కెట్లలో పూల ధరలు సైతం పెరిగిపోయాయి. అయితే.. దేవి నవరాత్రోత్సవాల ఉండటంతో శాఖాహార ప్రియులు కూరగాయలు కొనడం తప్పదనే చెప్పాలి. అయితే.. ముఖ్యంగా కూరగాయాల్లో టమాటో ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాటో ధర రూ. 100లుగా ఉంది.. మొన్నటివరకు కిలో రూ.10 నుంచి రూ.20 ఉన్న టమాటో ధర అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం రైతు బజార్లు, హోల్‌సేల్ షాపుల్లో కిలో రూ.60 నుంచి 80 వరకు ధర పలుకుతుండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.100కి చేరుకుంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సరఫరాలో కొరత ఏర్పడిందని కూరగాయల విక్రయదారులు ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. దెబ్బతిన్న పంటలు. సాధారణంగా, ధరలు ఈ సీజన్‌లో తగ్గుతాయి.. వేసవిలో మళ్లీ పెరుగుతాయి. కానీ.. అందుకు భిన్నంగా ఉంది. ఇకపోతే వేరే కూరగాయల పరిస్థితి కూడా ఇదే తీరు ఉంది. అయితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పంటు బాగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల ఎఫెక్ట్ ఇప్పుడు కూరగాయాలపై పడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com