TG : గ్రూప్ -1లో భారీ కుంభకోణం.. సీబీఐ దర్యాప్తుకు బీఆర్ఎస్ డిమాండ్

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాల్లో జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే ఈ కుంభకోణం జరిగిందని, ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేరు వేరు హాల్ టిక్కెట్లు ఇచ్చి కుంభకోణానికి తెరతీశారని అన్నారు.
21,093 మంది పరీక్షలు రాయగా 21, 103 మందికి ఫలితాలు ఎలా వచ్చాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ 654 మందికి ఓకే మార్కులు ఎలావచ్చాయని ప్రశ్నించారు.
ఈ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పదివేల మంది అభ్యర్థులు పరీక్షలు రాసిన కేంద్రాల్లో కేవలం 69 మందికే ఉద్యోగాలు రాగా 1494 మంది మహిళా అభ్యర్థులు రాసిన రెండు కేంద్రాల్లో 74 మందికి ఉద్యోగాలు ఎలావచ్చాయని అన్నారు. కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలికి 206 రాంక్ వచ్చింది.. ఎస్టీల్లో ఆమెకు మొదటి రాంక్ వచ్చిందని తెలిపారు. ఆమె సెంటర్ నెంబర్ 19 లో పరీక్షలు రాసిందన్నారు. ఈ సెంటర్ కోఠి ఉమెన్స్ కళాశాలలో ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేసారని ప్రశ్నించారు. అలాగే ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది పరీక్షలు రాస్తే.. ఏడుగురికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. తెలుగు మీడియం లో ఏడు వేల ఎనిమిది వందల మంది రాస్తే 70 మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు ఈ వ్యత్యాసానికి కారణాలు ఏమిటని టీడీపీఎస్సీని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com